వర్మకి కేఏపాల్ బెస్ట్ సలహ

వర్మకి కేఏపాల్ బెస్ట్ సలహ

0
104

వివాదాలతో నిత్యం సావాసం చేసే వ్యక్తి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .. కాంట్రావర్సీని కేరాఫ్ అడ్రస్ గా మార్చుకునే వర్మ ఎంచుకునే సినిమా స్టోరీలు అలాగే ఉంటాయి.. అయితే తాజాగా ఆయన కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశారు.. ఇది టైటిల్ నుంచి ట్రైలర్ , పాటలు ఇలా అన్నింటిలో వివాదాలకు కేరాఫ్ అ్రడస్ గా మారింది.

అయితే వర్మ స్టైల్ అలాంటిది కాబట్టి ,ఈ విషయంలో అందరూ ఊహించిందే జరిగింది, దీనిపై కోర్టు వరకూ సినిమా వివాదం నడిచింది, అయివతే కొందరి క్యారెక్టర్లని తక్కువ చేసి వారిని దిగజార్చేలా వర్మ సినిమా తీశారు అని విమర్శలు వస్తున్నాయి.

ఈ సినిమాలో కేఏ పాల్ పాత్ర కూడా ఉంది..దీనిపై పాల్ కూడా మాట్లాడారు… రామ్ గోపాల్ వర్మపై తనకు మంచి అభిప్రాయం ఉందన్నారు. వర్మ తీసే సినిమాలు సమాజానికి పనికొచ్చేలా ఉండాలని, కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉండకూడదని పాల్ హితవు పలికారు. హిందీ సినిమా పీకేలా ఉండాలన్నారు. అయితే ఎవరి మాట వినని వర్మ పాల్ మాట వింటారా అనేది చూడాలి.