యాదాద్రి ఆలయానికి కడప జిల్లా జడ్పీటీసీ కిలో బంగారం విరాళం

Kadapa District JDPTC donated 1 kg of gold to Yadadri Temple

0
66

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణానికి చేపట్టి, పూర్తి చేయడం ఒక గొప్ప యజ్ఞం అని వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాపారవేత్త, చిన్న మండెం జెడ్పీటీసీ మోడెం జయమ్మ కొనియాడారు. అతి త్వరలో ఆ దేవాలయాన్ని పునః ప్రారంభించబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రకటించారు.

పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గర్భగుడిని బంగారు తాపడంతో చేపడుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరమని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రకటన మేరకు నేను, నా కుటుంబ సభ్యులందరం కలిపి ఒక కేజీ బంగారాన్ని దేవాలయానికి విరాళంగా ప్రకటిస్తున్నామని మోడెం జయమ్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం కేసీఆర్ ని మరోసారి యాదాద్రి పర్యటన సందర్భంగా కలిసి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో అందజేస్తామన్నారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి అంటే నాకు ఎంతో నమ్మకం, ఇష్టమని చెప్పారు. ఈ మహత్తర కార్యక్రమంలో నేను, నా కుటుంబ సభ్యులు భాగస్వామ్యం అవుతున్నందున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి, సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ప్రకటించారు.