కడప జిల్లాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు మరో కీలక నేత చేరనున్నారు అని తెలుస్తోంది.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన వైయస్ తో ఎంతో సన్నిహితంగా ఉండేవారు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని, ఎన్నికల ముందు జగన్ ని విమర్శించారని, అయితే ఇప్పుడు పరిస్దితి పూర్తిగా మారిపోవడం కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అని తేలడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పాలి అని భావిస్తున్నారట. అందుకే ఆయన వైసీపీలోకి రావాలి అని చూస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆయన ఎన్నికల సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి ఆయనని పార్టీలో చేర్చుకోవద్దు అని చెబుతున్నారట కొందరు నేతలు.
అయితే ఆయన వైయస్ కుటుంబంతో ఇప్పటికీ సన్నిహితంగా ఉండటంతో జగన్ కు బాగా కావలసిన వారితో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే తనకు పదవులు వద్దు అని పార్టీ తరపున ఉంటాను అని చెబుతున్నారట.. అయితే జగన్ మాత్రం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. కాని పార్టీ కేడర్ అక్కడ నేతలు స్దానిక కేడర్ మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారట. మరి చూడాలి అన్నీ సెట్ అయితే ఆయన డిసెంబరులో వైసీపీలో చేరవచ్చట, ఇది ప్రస్తుతం కడపలో టాక్