ప్రతీ ఒక్కరికి కన్నీరు తెప్పించే సంఘటన ఇది… కరోనాను నివారించేందుకు దేశ మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది… దీంతో ఉపాది కోసం పట్టణాలకు వెళ్లిన కూలీల పరిస్థితి దయనీయంగా మారింది… ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి తన గ్రామంలో ఉపాధి లేక కొన్ని సంవత్సరాల క్రితం షహ్రాన్ పూర్ లోని ఒక కంపెనీలో పని చేస్తున్నాడు
ఇటీవలే కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రటించారు దీంతో రూమ్ ఓనర్ ఖాళీ చేయించారు… దీంతో తమ సొంత గ్రామానికి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది… ఇంటికి వెళ్దామంటే ఒక్క ఆటో లేదు బస్సుకూడా బంద్… షహ్రాన్ పూర్ నుంచి సొంత ఊరికి 200 కిలో మీర్లు…
చేసేదేమిలేక తన భార్యతో కలిసి కాలినడకతో సొంత ఊరికి బయల్దేరాడు… ప్రస్తుతం అతని భార్య ఎనిమిది నెలల గర్భని కడుపులో బిడ్డను పెట్టుకుని సుమారు వంద కిలో మీటర్లు నడిచింది… ఈ సంఘటన చూసిన ప్రతీ ఒక్కరికి కన్నీరు తెప్పిస్తోంది…