కన్నాకు కరోనా కలిసొచ్చిందా…?

కన్నాకు కరోనా కలిసొచ్చిందా...?

0
82

ఏపీ బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ గురించి ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది… ఆయన పార్టీలో కొద్దిమందికే నాయకుడుగా కనిపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి… మెజార్టీ పార్టీ నేతలు కన్నాను రాష్ట్ర అధ్యక్షుడుగా అంగీకరించలేకపోతున్నారట… అంతేకాదు ఆయన ఏర్పాటు చేసిన సమావేశాలకు కూడా పార్టీ నేతలు పెద్దగా హాజరు కాకున్నారు…

వచ్చిన వారు కూడా మొక్కుబడిగా హాజరవుతున్నారని వార్తలు వచ్చాయి… చైనా మహమ్మారి కరోనా రాకుంటే కన్నా అధ్యక్షపదవి నుంచి తొలగిస్తారనే వార్తలు కూడా వచ్చాయి… నిజానికి కన్నా బీజేపీ సిద్దాంతాల కోసం పార్టీ చేరలేదని అంటున్నారు… ఆయన దశాబ్దాల రాజకీయ జీవితం కాంగ్రెస్ లోనే కొనసాగింది…

2014 ఎన్నికల తర్వాత కూడా కన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు… 2019 ఎన్నికల నాటికి ఆయన బీజేపీలో అనివార్య పరిస్థితిలో చేరాల్సి వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.. కన్నా అద్యక్ష పదవి చేపట్టిన తర్వాత బీజేపీలో ఉన్న కీలక నేతలు పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే…