ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో ఎంపీ సుజనా చౌదరి భేటీ!

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో ఎంపీ సుజనా చౌదరి భేటీ!

0
96

రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ తో కలిసి ఆయన బీజేపీలో చేరారు. ఈ రోజు ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలుసుకున్నారు. ఢిల్లీలోని పార్లమెంటు కార్యాలయానికి వచ్చిన సుజనా, కన్నాతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడంపై కూడా వీరు చర్చించినట్లు సమాచారం.