జగన్ కు మద్దతు ఇచ్చిన కన్నా….

జగన్ కు మద్దతు ఇచ్చిన కన్నా....

0
101

రాయలసీమలో నిరంతరం కరువు అనే మహమ్మారి నృత్యం చేస్తోంది… అయితే దీని నివారణకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం కాలువలు సామర్థ్యం పెంచి కృష్ణా జలాలు వాడుకునేందుకు వీలుగా కొత్త ప్రాజెక్ట్ కు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే…

దీనికి తెలంగాణ సర్కార్ తప్పుబడుతోంది… ఇక ఇదే అంశం పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పందించారు… రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సిందే అని అన్నారు.. తెలంగాణ సర్కార్ తో న్యాయపోరాటం చేసి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఏపీ సర్కార్ ను కోరారు…

గతంలో రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని బీజేపీ అనేక పోరాటాలు చేసిందని అన్నారు కన్నా లక్ష్మీనారాయణ… పోతిరెడ్డి పాడు విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఏపీ బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు…