ఏ ప్రాంతం వారైనా తమ ప్రాంతం డవలప్ అవ్వాలి అని కోరుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ రధసారధుల చేతుల్లో అన్నీ ఉంటాయి కాబట్టి డవలప్ మెంట్ కు అన్ని విధాలుగా నిధులు కేటాయించాలి అని ప్రజలు కోరుకుంటారు, అయితే కొన్ని ప్రాంతాలు ఇంకా ఏపీలో చాలా వరకూ డవలప్ కాలేదు. వాటి గురించి చాలా మంది చెప్పుకుంటారు.
అలాంటి ప్రాంతం ఉత్తరాంధ్రా, ఇంకా వెనుకబాటులోనే ఉంది అని చెప్పాలి, తాజాగా ఏపీ రాజధానిగా విశాఖను ప్రకటించడంతో ఉత్తరాంధ్రా ప్రజలు ఆనందంలో ఉన్నారు..ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సందర్భంగా తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు.
ఇతర జిల్లాలతో పోల్చితే శ్రీకాకుళం ఎంతో వెనుకబడిందని, ఇక్కడి ప్రజలు ఉపాధి లేక పొట్టకూటి కోసం వలస పోతుండడం చూస్తుంటే బాధగా ఉందంటూ కంటతడి పెట్టారు. ఆయన ఇటీవల అసెంబ్లీలో స్పీకర్ స్ధానంలో కూర్చుని తన సెగ్మెంట్ అలాగే జిల్లాలో పరిస్దితి వివరించారు. తాజాగా మళ్లీ తన ప్రాంతం గురించి చెప్పి బాధపడ్డారు.
శ్రీకాకుళం అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని రావాల్సిందేనని చెప్పారు, ఆయన మాటలతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.