చేనేత జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతు పలికిన కపిల్ సిబాల్

0
96

చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి రాజ్యసభ సభ్యులు కపిల్ సిబాల్ మద్దతు పలికారు. నేడు ఢిల్లీలోని ఆయన నివాసంలో చేనేత మహా వస్త్ర లేఖపై రాజ్యసభ సభ్యులు కపిల్ సిబాల్ సంతకం చేశారు. చేనేత వస్త్రంపై ఎంపీలందరి సంతకాలు తీసుకోవడం అద్భుతమని ఈ మేరకు తెలియజేసారు. ఈ ఉద్యమం సఫలీకృతం కావాలని జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత, నటి పూనం కౌర్, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవ్వారి భాస్కర్ కు ఆశీర్వాదం ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉద్యమాలకు మద్దతు ఇస్తామని చెప్పారు.