జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవలే ఏపీ వ్యాప్తంగ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డబ్బులు విచ్చల విడిగా ప్రజలకు పంచారని అన్నారు. ఈ అవినీతిపై తాను సుప్రీంకోర్టులో పిటీషన్ వేస్తానని స్పష్టం చేశారు.
తాజాగా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా విచ్చలవిడిగా ప్రజలకు డబ్బులు పంచారని అరోపించారు. ఎన్నికల ఫలితాల రోజు 50 శాతం వరకు వీవీ ప్యాడ్ స్లిప్పులను కౌంటింగ్ చేయాలని పాల్ డిమాండ్ చేశారు.
మరోసారి కేంద్ర బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు కష్టల్లో పడక తప్పదని అన్నారు. మోడీకి వ్యతిరేకంగా సుమారు 22 పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయనున్నామని అన్నారు. అయితే తాను బీజేపీ తరపున ఉండాలో కూటమి తరపున ఉండాలో ప్రజలు నిర్ణయించాలని కేఏ పాల్ తెలిపారు.