కరణం బలరాం కు వైసీపీ గాలం

కరణం బలరాం కు వైసీపీ గాలం

0
90

తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్ కరణం బలరాం, చంద్రబాబుతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. ఇద్దరూ పాలిటిక్స్ లోకి ఒకేసారి వచ్చారు.. అయితే ఆయన ఈసారి చీరాల నుంచి పోటీ చేసి గెలిచారు.. అయితే అక్కడ ఆమంచి వైసీపీలో చేరి పోెటీ చేసినా ఓటమి పాలయ్యారు.
తాజాగా ఆయనకు వైసీపీ నేతలు గాలం వేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయట.

అంతేకాదు పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్న ఆయనకు చంద్రబాబు గతంలో కూడా విలువ ఇవ్వలేదు అని అందుకే ఆయన పార్టీ మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు అని అంటున్నారు.. అయితే చీరాల వార్తలు ఇలా ఉంటే టీడీపీ శ్రేణులు మాత్రం ఆయన పార్టీ మారరు అని నొక్కి చెపుతున్నారు.. ఇప్పుడు ప్రకాశం జిల్లా టీడీపీ బాధ్యతలు కూడా కరణం కుటుంబానికి ఇవ్వాలి అని బాబు చూస్తున్నారట.. ఈ సమయంలో ఆయన పార్టీ మారినా ఎలాంటి పదవులు రావు అందుకే ఆయన టీడీపీలో ఉంటారు అని, కావాలనే కొందరు వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారం అని టీడీపీ కొట్టిపారేస్తోంది.