ఖరీదైన యాక్సిడెంట్ – ఆ యాక్సిడెంట్ నష్టం 30 కోట్లు ఏమైందంటే

ఖరీదైన యాక్సిడెంట్ - ఆ యాక్సిడెంట్ నష్టం 30 కోట్లు ఏమైందంటే

0
130

యాక్సిడెంట్ లు జరిగితే కొన్ని సార్లు అందులో ప్రయాణం చేసిన వారి ప్రాణాలు కూడా పోతాయి, మరికొన్ని సార్లు దారుణమైన డ్యామేజ్ జరుగుతుంది, అయితే ఓ నాలుగు కార్లు రయ్యిన వెళుతున్న సమయంలో ఢీ కొట్టుకున్నాయి, చివరకు భారీ డ్యామేజ్ జరిగింది, ఏమి జరిగిందో చూద్దాం.

ఓ నాలుగు కార్లు చేసిన యాక్సిడెంట్ వల్ల నాలుగు మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు 30కోట్ల రూపాయలు
నష్టం వచ్చింది, స్విడ్జర్లాండ్ లోని ఆల్ఫ్ పర్వతశ్రేణుల దగ్గర మెర్సిడెజ్ బెంజ్ సి-క్లాస్ వేగన్, పోర్షే 911 కాబ్రియోలెట్, బుగాటి చిరోన్ కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.. వారు చికిత్స పొందుతున్నారు, అయితే ఈ ఖరీదైన కార్లు వేగంగా వెళుతున్న సమయంలో .. మెర్సిడెజ్ బెంజ్ కారు వెళుతూ ఉండగా.. ఆ కారు వెనుకనే బుగాటి, పోర్షే కార్లు వెళుతూ ఉన్నాయి. బెంజ్ కారును ఓవర్ టేక్ చేయాలని పోర్షే 911 కాబ్రియోలెట్, బుగాటి చిరోన్ కార్లు ఒకేసారి ప్రయత్నించాయి. చివరకు నాలుగు కార్లు ఢీ కొట్టుకున్నాయి, ఇది అత్యంత ఖరీదైన యాక్సిడెంట్ గా చెబుతున్నారు..ఇక్కడ అన్నీంటి కంటే పోర్షే కారుకు ముందున్న బంపర్, హుడ్ బాగా డ్యామేజ్ జరిగింది అని తెలిపారు.