కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఎస్​ఐ ఉద్యోగాల్లో వారికి 1% రిజర్వేషన్​

Karnataka government makes sensational decision..1% reservation for them in SI jobs

0
75

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక స్టేట్ రిజర్వ్​ పోలీస్(కేఎస్​ఆర్​పీ), ఇండియన్ రిజర్వ్​ బెటాలియన్​లో ​(ఐఆర్​బీ) స్పెషల్ రిజర్వ్​ సబ్​- ఇన్​స్పెక్టర్​ పోస్టులకుగాను మహిళలు, పురుషులతో పాటు ట్రాన్స్​జెండర్లూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. లింగ వివక్షతను రూపుమాపేలా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ట్రాన్స్​జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.