బ్రేకింగ్ .. ఏపీలో తొలికరోనా వైరస్ కేసు నమోదు ఎక్కడంటే

బ్రేకింగ్ .. ఏపీలో తొలికరోనా వైరస్ కేసు నమోదు ఎక్కడంటే

0
81

చైనా దేశాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది.. అయితే ఇది మన దేశానికి కూడా పాకింది … ఇప్పటి వరకూ 50 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, అన్నీ కూడా ఇతర దేశాల నుంచి ఇక్కడకు వస్తున్న వారి ద్వారానే ఈ వైరస్ వ్యాప్తి జరుగుతోంది అని తెలుసుకున్నారు, అంతేకాదు ఈ వైరస్ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఎయిర్ పోర్టుల్లో ధర్మల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేశారు..

ఇక ఏపీలో తెలంగాణలో కూడా కరోనా భయం వీడడం లేదు. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య క్రమ క్రమం పెరుగుతోంది.
కేరళ రాష్ట్రంలో కనిపించిన ఈ వైరస్ ఇప్పుడు దాదాపు పది స్టేట్స్ ని వణికిస్తోంది… తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఈ కరోనా భయాలు మరింత పెరిగాయి, తాజాగా ఏపీలో కరోనా పాజిటీవ్ కేసు నమోదు అయింది..

కరోనా వైరస్ లక్షణాలతో నిన్న నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. అతడి రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చినట్లు తెలుస్తోంది.దీంతో నెల్లూరు జిల్లా ప్రజలు షాక్ అయ్యారు, అతని కుటుంబ సభ్యులు అతను ఎవరితో ఇప్పటి వరకూ ట్రావెల్ చేశారో వారి హెల్త్ కూడా చూడనున్నారు..నగరంలోని చిన్న బజారులో ఓ వ్యక్తి రెండు రోజుల క్రితమే ఇటలీ నుంచి వచ్చారు. అతను జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో అతనికి చికిత్స కోసం తీసుకువచ్చారు అని తెలుస్తోంది, దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది.