కరోనా వైరస్ ఖమ్మంలో ఈ వ్యాపారులపై ఎఫెక్ట్ కొట్టింది

కరోనా వైరస్ ఖమ్మంలో ఈ వ్యాపారులపై ఎఫెక్ట్ కొట్టింది

0
87

కరోనా వైరస్ పేరు చెబితే ఇప్పుడు అందరూ భయపడిపోతున్నారు, అయితే ఖమ్మంలో ఇది మరింత వార్తగా మారింది.. ఎందుకు అంటే కరోనా ఎఫెక్ట్ తో చైనాకు ఎలాంటి వస్తువులు వెళ్లడం లేదు. కొద్ది రోజులుగా ఎక్స్ పోర్టులు కొన్ని ఆగిపోయాయి .. కరోనా వైరస్ పేరు చెప్పి ఖమ్మం నుంచి మిర్చి వ్యాపారులు దోపిడీకి తెర తీశారు. కమీషన్ ఏజెంట్లు ధరలు భారీగా తగ్గించారు.

చైనాలో ప్రబలిన ఈ వైరస్తో ఖమ్మం మార్కెట్ యార్డ్లో వ్యాపారులు మిర్చి కొనుగోళ్లను నిలిపి వేశారు. అంతేకాదు.. క్వింటాల్ 20 వేలు ఉండేది ఒక్కసారిగా 10 వేలకు పడిపోయింది. అయితే చైనాలో ఉన్న పరిస్దితుల వల్ల అక్కడ వ్యాపారులు కూడా మిర్చి అడగం లేదని వ్యాపారాలు పెద్ద గా లేవని అంటున్నారు.

రైతుల నుంచి అందుకే మిర్చి కూడా కొనుగోలు చేయడం లేదు. మార్కెట్కు మిర్చి తీసుకొచ్చే విషయంలో రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు. అయితే వ్యాపారులు కావాలని చేస్తుంది కాదని, పైన ఎగుమతులకి వారు కోరనప్పుడు మిర్చి కొనుగోలు చేసి ఏమి చేయాలి అని వ్యాపారులు అంటున్నారు, అందుకే రైతుల కూడా ఇంత తక్కువకి పంట అమ్ముకోము అంటున్నారు.