భారత్ లో తొలి కరోనా వైరస్ కేసు ఎక్కడ నమోదైందంటే

భారత్ లో తొలి కరోనా వైరస్ కేసు ఎక్కడ నమోదైందంటే

0
77

చైనాలో వ్యాపించి, ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ పేరు చెబితే అందరూ భయపడిపోతున్నారు … దాదాపు 170 మంది ఇప్పటికే మరణించారు చైనాలో, అంతేకాదు సుమారు 7000 మంది దీనికి ఎఫెక్ట్ అయ్యారు, అయితే మన దేశంలో దీనిపై రక్షణ చర్యలు తీసుకుంటున్నారు, ఈ సమయంలో భారత్లోకి ప్రవేశించింది కరోనా వైరస్.

చైనాలోని వుహాన్ విశ్వవిద్యాలయంలో చదువుతోన్న ఓ విద్యార్థి ఇటీవల కేరళకు వచ్చాడు. అనారోగ్యంతో ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించగా, పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా వైరస్ సోకిందని నిర్ధారించారు. అయితే జలుబు దగ్గు తగ్గకపోవడంతో అతను టెస్ట్ చేయించుకున్నాడు. దీంతో వైరస్ లక్షణాలు ఉన్నాయి అని తేలింది.

దీంతో అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయింది.. వారి కుటుంబానికి కూడా టెస్టులు చేయించారు. ఆ స్టూడెంట్ ఎవరితో తిరిగాడు వారికి సంబంధించి హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకుంటున్నారు. అతని ఆరోగ్యం బాగానే ఉంది. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రత్యేక వార్డుకి తరలించి చికిత్స అందిస్తున్నారు.