కరోనా వైరస్ కి వజ్రాలకి సంబంధం ఉందా

కరోనా వైరస్ కి వజ్రాలకి సంబంధం ఉందా

0
82

కరోనా వైరస్ చైనాని చుట్టుముట్టేసింది.. పెద్ద ఎత్తున అక్కడ జనం భయపడిపోతున్నారు. తుమ్మినా దగ్గినా జలుబు చేసినా వైరస్ సోకింది అనే భయం వారిలో కనిపిస్తోంది.. ఇప్పటికే 450 మంది మరణించారు… 20 వేల మందికి ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి.. 1.50 లక్షల మందికి అనుమానం అనే రిపోర్టులు వస్తున్నాయి.

అయితే చైనాలో ఇలాంటి పరిస్దితి ఉంటే ఇప్పటికే చైనా నుంచి రావాల్సిన టాయ్స్ చైనా ఉత్పత్తులు మన దేశంలో చాలా వరకూ తగ్గిపోయాయి.. ఇక్కడ ఉన్న చైనా ప్రొడక్ట్స్ మరింత రేట్లు పెంచుతున్నారు వ్యాపారులు.. దీంతో స్వదేశీ వస్తువులు కొందరు కొంటున్నారు, అయితే చైనా వస్తువులు కొంటే వైరస్ వస్తుంది అనే భయం చాలా మందిలో ఉంది. అక్కడ సిబ్బంది లేక ప్రొడక్షన్ కూడా చేయడం లేదు.

అయితే తాజాగా మిర్చి ఎగుమతులు కూడా చాలా వరకూ నిలిచిపోయాయి.. దీంతో మిర్చి వ్యాపారులు బాగా నష్టపోయారు..కరోనా వైరస్ కారణంగా భారత్ లో వజ్రాల పరిశ్రమ వేల కోట్లలో నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ నుంచి ప్రధానంగా వజ్రాలు దిగుమతి చేసుకునే మార్కెట్లలో హాంకాంగ్ ఒకటి. గుజరాత్ లోని సూరత్ నుంచి ఇక్కడికి ఏటా రూ.50 వేల కోట్ల విలువైన మేలుజాతి వజ్రాలు ఎగుమతి అవుతుంటాయి.

అయితే హాంకాంగ్ లో కరోనా ఎఫెక్ట్ ఉంది.. దీంతో అక్కడ వ్యాపారాలు అంత జరగడం లేదు.. నెల రోజుల వరకూ హంకాంగ్ లో ఎవరికి అనుమతి లేదు..
దీంతో సూరత్ వజ్రాల పరిశ్రమకు సుమారుగా రూ.8 వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇది భారత్ కు వ్యాపారానికి పెద్ద ఇబ్బందే అంటున్నారు.