కరోనా వైరస్ కి కొత్త పేరు ఎందుకు పెట్టారో తప్పక తెలుసుకోండి

కరోనా వైరస్ కి కొత్త పేరు ఎందుకు పెట్టారో తప్పక తెలుసుకోండి

0
122

ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా వైరస్ దీని దాటికి దాదాపు 700 మంది వరకూ ప్రాణాలు పోగొట్టుకున్నారు, 40 వేల మందికి ఈ వైరస్ సోకింది అని తెలుస్తోంది.. ఇంకా లక్షలాది మందికి పరీక్షలు జరుగుతున్నాయి.. అయితే ప్రపంచానికి చైనాలో విజృంభిస్తున్న ఈ కరోనా వైరస్ ఓ పెను సవాల్ విసురుతోంది.. దీని కోనం నిరంతరం టెస్టులు చేసి మందు కనుగొనేందు కు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తాజాగా ఈ కరోనా వైరస్ పేరు మార్చింది ప్రపంచ ఆరోగ్య సంస్ద.. ప్రమాదకర ఈ వైరస్కు కోవిడ్-2019 అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కొత్త పేరు పెట్టింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ టెడ్రస్ అదానోమ్ తెలిపారు. కోవిడ్-19 (covid-2019) అంటే ‘కరోనా వైరస్ డిసీజ్ 2019’ అని అర్థమని తెలిపారు.

అయితే ఇలాంటి కొత్త వైరస్ లు వచ్చిన సమయంలో ప్రపంచానికి హెల్తె ఎమెర్జెన్సీగా వాటికి సరైన పేర్లు పెడతారు.. తాజాగా ఈ పేరుని అందుకే పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని వైరస్ల సమూహానికి కరోనా అని పేరు ఉందని, దాంతో ఈ గందరగోళాన్ని తొలగించేందుకే కొత్త పేరు పెట్టినట్టు తెలిపారు.. ఈ కొత్త పేరు కేవలం ఈ వ్యాధిని మాత్రమే గుర్తిస్తుంది అని చెప్పారు.