కరుణానిధి కుటుంబంలో మూడో తరం వారసుడు కూడా అసెంబ్లీకి

కరుణానిధి కుటుంబంలో మూడో తరం వారసుడు కూడా అసెంబ్లీకి

0
83

తమిళనాడులో ఇప్పుడు కరుణానిధి కుమారుడు స్టాలిన్ సీఎం అయ్యారు, అయితే మూడో తరం కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు… డీఎంకే, అధికారంలోకి వచ్చింది, ఇక పది సంవత్సరాల తర్వాత డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది.

 

ఇక ఈసారి ఎన్నికల్లో గత హిస్టరీ రీపీట్ అయింది, కరుణానిధికి స్టాలిన్ ఎలా కుడభుజంలా ఉన్నారో ఇప్పుడు స్టాలిన్ కు కూడా హీరో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా అసెంబ్లీలో కాలుమోపనున్నారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచారు.

 

దీంతో కరుణానిధి కుటుంబం చాలా ఆనందంలో ఉన్నారు… కరుణానిధి కుటుంబంలో మూడవ తరం రాజకీయాల్లోకి ప్రవేశించినట్లయింది. ఇక హీరోగా నిర్మాతగా తమిళనాడులో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఉధయనిధి స్టాలిన్ తాజాగా ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.

చేపాక్కం – ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక త్వరలోనే ఆయన మంత్రి పదవి కూడా చేపట్టే అవకాశం ఉంది అని టాక్ నడుస్తోంది.