పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే….

పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే....

0
78

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా ఎమ్మెల్యే పక్కా ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నారు… 2019 ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి వైసీపీ తీరపున గెలిచిన కాసుమహేష్ రెడ్డి ప్లాన్ ప్రకారం అడుగులు ముందుకు వేస్తున్నారు..

తన నియోజకవర్గంలో దశాబ్దాల కాలం నాటినుంచి అభివృద్దికినోచుకోని దాదాపు 20 గ్రామాలను అభివృద్ది చేయాలని నిర్ణయించుకున్నారు కాసు… గతంలో ఈ సెగ్మెంట్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యరపతినేని శ్రీనివాసరావు ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు చేయలేదు…

దాదాపు రెండు దశాబ్దాలపాటు ఈ నియోజకవర్గంలో చక్రం తిప్పిన ఆయన ఈ ఎన్నికల్లో జగన్ సునామితో ఓటమి చెందారు. ఇక్కడ విజయం సాధించిన కాసు మహేష్ రెడ్డి తన రాజకీయ జీవితానికి మరింత పునాదులు వేసుకోవాలని చూస్తున్నారు…గత ఎన్నికల సమయంలో కాసు చూపంతా తన నియోజకవర్గం నరసరావుపేటపైనే ఉంది కానీ కొన్ని సమీకరణాల నేపథ్యంలో జగన్ అక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నియమించారు…

ఇప్పుడు ఆయన నరసరావుపేటలో బలంగా పాతుకుపోతుండటంతో కాసు ఇక్కడ బలంగా ఎదగక తప్పనిసరి పరిస్థితి అందుకే అభివృద్దికి నోచుకోని ప్రాంతాలను ఎంపీకి చేసుకుని గురజాలలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు.