ఆగని వలసల పర్వం..కాంగ్రెస్ లోకి కత్తి కార్తీక గౌడ్

0
121
Hath se Hath Jodo

తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వలసలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే హస్తం పార్టీ నుండి గులాబీ పార్టీకి వలసలు పెరిగాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నాయకులు కారు దిగి కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. అటు బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి కారు నుండి బీజేపీలోకి వలసలు జరుగుతున్నాయి. దీనితో కాంగ్రెస్ పార్టీ బలపడుతుండగా వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి, పలువురు ముఖ్య టిఆర్ఎస్ నాయకులూ పదువులు వదులుకొని మరి టిఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక తాజాగా రేపు కత్తి కార్తీక గౌడ్ గాంధీభవన్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

రేపు 11:00 గంటల సమయంలో పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్కల ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ శ్రీ మ‌ధు యాష్కీ గౌడ్‌, రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కులు స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

కాగా కత్తి కార్తీక రేడియో జాకీ, ఆర్కిటెక్. కార్తీక v6 ఛానల్ లో “దిల్ సే కార్తీక” కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందింది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నది.