జగన్ పై కత్తి నూరిన మహేష్

జగన్ పై కత్తి నూరిన మహేష్

0
116

కత్తి మహేష్ ఈపేరు ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితం… సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కరెంట్ ఇష్యూస్ పై తనదైన శైలిలో కత్తి నూరుతుంటారు మషేష్. రెండు శత్రు దేశాలకు మధ్య ఎంత వైర్యం ఉంటుందో గతంలో పవన్ కళ్యాన్ కు ఆయన అభిమానులకు అంత వైర్యం ఉండేది…

దీంతో పోలీసులు శాంతి బధ్రతల రిత్య నగర భహిష్కరణ అయ్యారు కత్తి.. ఇక అప్పటినుంచి కత్తి.. తన కత్తిని నూరడం తగ్గించారు. అయితే తాజాగా ఈ సారి పవన్ పై కత్తి నూరకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై కత్తి నూరాడు మహేష్….

పది సంవత్సరాలు ఎల్లో మీడియా రాతల్ని ఎదుర్కొని ప్రజల్ని గెలుచుకున్న జగన్. ఇప్పుడు ఏ భయంతో మీడియా నియంత్రణకి పాల్పడాలి? ఆ రెండు చానళ్లు, ఈ రెండు పత్రికలు అని వాటికి అనవసరపు ప్రాధాన్యత పెంచడం ఎందుకు? గెలిపించిన ప్రజల విజ్ఞతని నమ్మి,మీడియాని తనదారిన వదిలేస్తే,నిలబడేవి నిలబడతాయి పోయేవి పోతాయని కత్తి జగన్ సలహా ఇచ్చారు.