లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

0
92

ఇక ఏప్రిల్ 14 వ‌ర‌కూ లాక్ డౌన్ కొన‌సాగుతుంది, అయితే త‌ర్వాత మ‌రికొన్ని రోజులు లాక్ డౌన్ ఉంటుందా లేదా అక్క‌డితో ఆపేస్తారా అనేది ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రు ఆలోచిస్తున్న ప‌రిస్దితి.. ఇప్ప‌టికే గ‌త 10 రోజులుగా చాలా వ‌ర‌కూ అంద‌రూ ఇంటికి ప‌రిమితం అయ్యారు.

కేంద్రం ఏమో లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచ‌న‌లో ఉంది అని వార్త‌లు వ‌స్తున్నాయి, అయితే సీఎం కేసీఆర్ లాక్ డౌన్ పై కీలక ప్ర‌క‌ట‌న చేశారు, ఇప్పుడు ఉన్న ప‌రిస్దితిలో లాక్ డౌన్ ఎత్తివేస్తే మ‌ళ్లీ క‌ధ మొద‌టికి వ‌స్తుంది అని అన్నారు,

మన దేశానికి లాక్‌డౌన్‌ తప్ప వేరే మార్గం లేదు అని ఆయన తేల్చిచెప్పారు. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత లాక్ డౌన్ ను పొడిగించాలని ప్రధాని మోదీని కోరుతానని సీఎం పేర్కొన్నారు. ఈ విష‌యంలో అందరూ మంచిగా స‌హ‌క‌రిస్తున్నారు అని ఇంకా ఇలాగే ఉండాలి అని తెలిపారు సీఎం కేసీఆర్. క‌చ్చితంగా ఆయ‌న మాత్రం లాక్ డౌన్ ఇంకా పొడిగించాలి అని తెలియ‌చేశారు.