Flash: ప్రధాని మోదీకి కేసీఆర్ సూటి ప్రశ్న

0
80

కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రం నుండి తెలంగాణకు వచ్చేది గుండు సున్న. ఇక్కడి నుండి వచ్చే సొమ్ముతో వాళ్లు సోకులు పడుతున్నారు. 8 సంవత్సరాల నుండి తెలంగాణకు కేవలం 42,000 కోట్లు మాత్రమే వచ్చాయి. నదులు అనుసంధానంపై ప్రభుత్వం సిగ్గు పడాలి. ఏ అధికారంతో గోదావరి-కృష్ణా- కావేరి అనుసంధానం చేస్తావని ఏ అధికారంతో చెప్పారని ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నించారు. మాకు హక్కు ఉన్న జలాలను కావేరిలో ఎలా కలుపుతారు. అభిప్రాయాలు తీసుకోకుండా బడ్జెట్‌లో ఎలా ప్రకటిస్తారు’’ అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు.