ఈ లాక్ డౌన్ సమయంలో దారుణంగా 45 రోజులు చుక్క మందు దొరక్క చాలా మంది మందు బాబులు బాధపడ్డారు, కొందరు మందు మానెయ్యాలి అని ఫిక్స్ అయ్యారు, కాని లాక్ డౌన్ సడలింపుల్లో ముందు మందుషాపులు తెరిచారు, దీంతో మందుబాబులకు ఇదే దసరా సంక్రాంతిగా మారింది.
వెంటనే క్యూలు కట్టి మరీ మద్యం కొనుగోలు చేశారు, ఇకపై రాష్ట్రంలో రాత్రి 9:30 వరకు మద్యం దుకాణాలను తెరిచే ఉంచుతామని మంత్రి చెప్పారు, దీంతో ఇక పెద్ద సంఖ్యలో షాపులు బంద్ అవుతాయి అని క్యూలు కట్టాల్సిన పనిలేదు.
మద్యం కోసం క్యూ లైన్ లో ఉండి తీసుకోవచ్చు.గురువారం నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. బుధవారం వరకు రాత్రి 9 గంటలకే ఈ దుకాణాలు పనిచేశాయి.ఇక ఎక్కడైనా గుడుంబా అమ్మకాలు జరిగితే ప్రభుత్వానికి తెలియచేయాలి అని తెలిపారు, వారిపై కేసులు పెడతామని తెలిపారు.