నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త..ఆ పోస్టుల భర్తీకి ఆదేశాలు

0
84

నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణలోని తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 765 కాంట్రాక్టు అధ్యాపకులు, వైద్యుల పోస్టులు మంజూరు అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ వైద్య విద్యా కళాశాలల్లో కాంట్రాక్టు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

కొత్త పోస్టులు ఉస్మానియాలో 135, గాంధీ 135, కాకతీయ 135, మహబూబ్నగర్ 70, సిద్దిపేట 70, రిమ్స్ ఆదిలాబాద్ 70, సూర్యాపేట 40, నల్గొండ 40 పోస్టులు, నిజామాబాద్ 70 పోస్టులు వైద్య కళాశాలలకు మంజూరు చేశారు. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మరో వారం రోజుల్లోనే విడుదల కానున్నట్లు ఆర్థిక శాఖ తమ స్పష్టం చేసింది. దీనిపై తదుపరి మార్గదర్శకాలను విడుదల చేయనుంది.