తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పడిపోతుంది..భాజపా ప్రభుత్వం నిలబడుతుంది: అమిత్ షా

0
96

మునుగోడు బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కేసీఆర్‌, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు పదవుల్లో ఉంటే మాకు బాధ లేదు. కేసీఆర్‌ కుటుంబ పాలన వల్ల ప్రజలు ఎందుకు బాధ పడాలి.

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంగా మారింది. మునుగోడు అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉంటుంది. బీజేపీని గెలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వం మాయం అవుతుంది. మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపడం లేదు. తెలంగాణలో భాజపా ప్రభుత్వం వచ్చి తీరుతుంది. భాజపా ప్రభుత్వం వచ్చాక సెప్టెంబరు 17ను ఉత్సవంగా జరుపుతాం.

దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్బంగా అమిత్ షా రాజగోపాల్ రెడ్డికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం  రాజగోపాల్ రెడ్డి భుజం తట్టి అమిత్ షా అభినందించారు. అనంతరం ఇద్దరూ చేతులు పట్టుకుని పైకి ఎత్తారు.