గెల్లుకు బీ ఫారం అందజేత..ఎన్నికల ఖర్చుకు ఎంత ఇచ్చారంటే?

KCR handed over Bee Form to Gell Srinivas

0
124

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నేడు బీ ఫారం అందజేశారు. అలాగే ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఫండ్‌గా 28 లక్షల రూపాయల చెక్కును అందించారు కేసీఆర్.

హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రచార పర్వంలో దూకుడుగా వెళుతుండగా కాంగ్రెస్ పార్టీ ఇంతరవరకు హుజురాబాద్ అభ్యర్థినే ప్రకటించలేదు. ఆ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది జోరుగా చర్చ నడుస్తుంది.

ఈటెల రాజేందర్ రాజీనామా తర్వాత ఐదు నెలలుగా హుజురాబాద్ లో రాజకీయం వేడెక్కుతునే ఉంది. ఇటు బీజేపీ..అటు టీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ రెండు పార్టీలు దృష్టినంతా హుజురాబాద్ పైనే పెట్టాయి.