టీపీసీసీ పగ్గాలు చేపట్టాక రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ అవినీతిని ఎండగడుతూ అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు. ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తూ సీఎం కేసీఆర్ వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా
ఉద్యోగాల ఖాళీలను తక్కువ చేసి చూయించారు. బిస్వాల్ కమిటీ చెప్పిన 1,91,000 ఉద్యోగాలలో లక్ష ఉద్యోగాలు మింగేసి కేవలం 91 వేల ఉద్యోగాలంటూ నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారు. నిన్న అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ వెంటనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు. కానీ 24 గంటలు గడుస్తున్న ఏ నోటిఫికేషన్ రాలేదు. ఎప్పుడొస్తదో తెలీదు.
కేసీఆర్ సీఎం కాదు టిక్ టాక్ స్టార్ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ నేను అసెంబ్లీలో మాట్లాడింది ఇంతమంది చూశారు. ట్విట్టర్ లో అంతమంది చూశారు. నువ్వేమైనా సినిమా స్టార్ వా. సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే అన్ని వ్యూస్ వచ్చాయని చెబుతారు. కానీ ఒక సీఎంగా ఉండి ఇలా మాట్లాడడం బట్టి చూస్తే కేసీఆర్ సినిమా పిచ్చోడిలా కనిపిస్తున్నాడని చురకలు అంటించారు.