ఈటెల రాజేందర్ భూకబ్జా కేసు వేగవంతం చేశారు అధికారులు. దళితులకి చెందిన ఆసైన్డ్ భూములు ఈటెల కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మసాయిపేటకి చెందిన రైతులు కంప్లైంట్ చేయడంతో విచారణకి సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈటెల రాజేందర్ కు సంబంధించిన జమున హర్చరీస్ కు జూన్ లోనే నోటీసులు జారీ చేసిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే. కరోనా ఉధృతితో గతంలో హైకోర్ట్ స్టే ఇవ్వడంతో విచారణ ఆగిపోగా..తిరిగి ఈనెల 16న విచారణ చేపట్టనుంది.
దీనితో మెదక్ జిల్లా హకీంపేటలో సర్వే చేయనున్నట్లు అధికారులు నోటీసులు ఇచ్చారు. కాగా దీనిపై మెదక్ కలెక్టర్ హరీష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..హకీంపేటలోని సర్వే నంబరు 97లో సర్వే చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 18న సర్వేకు హాజరు కావాలని తూప్రాన్ ఆర్డీవో ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్‌రెడ్డికి నోటీసులు ఇప్పటికే పంపించామని కలెక్టర్ తెలిపారు.