తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి వర్గ విస్తరణలో భాగంగా నిన్న సాయంత్రం ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త గవర్నర్ తమిళ్ సై రాజ్ భవన్ లో ఈ ఆరుగురు మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ ఆరుగురిలో వరుసగా హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, కేటీఆర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ లు ఉన్నారు. అందరూ ఊహించినట్టుగానే కేటీఆర్ కు మంత్రి పదవి ఇచ్చారు. తెరాస మజ్లీస్ రెండు పార్టీలు కలిసి పోటీ చేయకపోయినా రెండు పార్టీల మధ్య మంచి అనుబంధం ఉంది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మంచి అవగాహనతో ముందుకు వెళ్తున్నారు.
మధ్యకాలంలో అంతర్జాతీయంగా హైదరాబాద్ ఐటీ కంపెనీలు వస్తున్నాయి. భారీ పెట్టుబడులతో హైదరాబాద్ లో కార్యాలయం నిర్మించి నిర్మిస్తున్నారు అలాగే వచ్చిన అమెజాన్ కంపెనీ నిర్మాణ సమయంలో కేటీఆర్ ఓ ట్వీట్ చేశాడు. దానికి స్పందించి కేటీఆర్ హయాంలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ ని తిరిగి మంత్రిగా చూడాలనుకుంటున్నాను అని ఓవైసీ అప్పట్లో ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే అసదుద్దీన్ కోరికను కేసీఆర్ నిన్న తీర్చినట్టు అయింది.
కేటీఆర్ కు తిరిగి మంత్రివర్గంలో చోటి వడమే కాకుండా గతంలో ఇచ్చిన అదే శాఖలను తిరిగి అప్పగించారు. బిజెపి దూకుడు కారణంగా హరీష్ రావునీ మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఓ కారణంగా తెలుస్తోంది. రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పార్టీకి హరీష్ రావు అవసరం ఉందని గ్రహించిన కేసీఆర్ హరీష్ ని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నాడని కొంతమంది వాదన.