కేసీఆర్ నిర్ణ‌యం చాలా బాగుంది రాముల‌మ్మ

కేసీఆర్ నిర్ణ‌యం చాలా బాగుంది రాముల‌మ్మ

0
71

క‌రోనావైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది, ఈ స‌మ‌యంలో యావ‌త్ ప్ర‌పంచం వ‌ణికిపోతోంది, అయితే తెలంగాణ‌లో కూడా కేసులు మ‌రిన్ని పెరుగుతున్నాయి, అయితే ఈ స‌మ‌యంలో విదేశాల్లో చాలా వర‌కూ అతి దారుణంగా ప‌రిస్దితి ఉంది, భార‌త్ అంత దారుణ‌మైన స్దితిలో లేదు అనే చెప్పాలి.

తెలంగాణ‌లో మాత్రం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు క‌రోనా గురంచి అధికారుల‌తో చ‌ర్చిస్తున్నారు, మంచి నిర్న‌యాల‌తో పాజిటీవ్ కేసులు గుర్తించి వారికి చికిత్స అందిస్తున్నారు.. ఐసోలేష‌న్ క్వారంటైన్లు కూడా గ‌ట్టిగా చేయిస్తున్నారు.

తాజాగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న తరుణంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తే.. మళ్లీ సమస్యలు వస్తాయని.. ప్రధాని మోదీకి కూడా ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. ఇక పూర్తిగా ఇది త‌గ్గాలి అంటే మ‌రికొన్ని రోజులు లాక్ డౌన్ ఇవ్వాలి అని చెప్పారు ఆయ‌న‌, అయితే సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ విషయంలో తీసుకునే నిర్ణయాలకు.. మద్దతు తెల్పుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ చైర్‌పర్సన్ విజయశాంతి తెలిపారు.
అంతేకాదు సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు ఆమె.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాక్ డౌన్‌కు మధ్య విరామం ఇవ్వవద్దని, మొత్తంగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పరిస్థితులలో ప్రజాసంక్షేమం దృష్ట్యా సంపూర్ణంగా సమర్ధిస్తున్నాను అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.