కేసీఆర్ ప్రెస్ మీట్లో ఈ రాహుల్ ఎవ‌రు? ఎందుకు ఆయ‌న అంత ఫేమ‌స్ అయ్యారు

కేసీఆర్ ప్రెస్ మీట్లో ఈ రాహుల్ ఎవ‌రు? ఎందుకు ఆయ‌న అంత ఫేమ‌స్ అయ్యారు

0
103

ఈ మ‌ధ్య సీఎం కేసీఆర్ కోవిడ్ వైర‌స్ గురించి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఈ స‌మ‌యంలో వైర‌స్ లాక్ డౌన్ గురించి స‌డ‌లింపుల గురించి తెలియ‌చేస్తున్నారు, అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సీఎం కేసీఆర్ ఏం చెబుతారా అని ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న వారు ఉన్నారు.

ఈ స‌మ‌యంలో సీఎం కేసీఆర్ ఎక్కువ‌గా జ‌ర్న‌లిస్టుల నుంచి ప్ర‌శ్న‌లు వ‌చ్చే స‌మ‌యంలో ఎక్కువ‌గా రాహుల్ అనే జ‌ర్న‌లిస్ట్ నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి, అయితే ఆ రాహుల్ ఎవ‌రు, సీఎం కేసీఆర్ చాలా స‌ర‌దాగా మాట్లాడుతున్నారు, ఓసారి సీరియ‌స్ అవుతున్నారు, అస‌లు ఎవ‌రు ఈయ‌న అని అంద‌రూ తెగ వెతుకుతున్నారు సోష‌ల్ మీడియాలో.

ఈ రాహుల్ అనే పేరుతో ఓ ఫోటో కూడా వైరల్ అయింది. దేవులపల్లి రాహుల్ అనే ఓ యువ జర్నలిస్టు ఫోటోను నెటిజనులు వైరల్ చేశారు. కానీ సీఎం ప్రెస్ మీట్‌కు ఆ యువ జర్నలిస్టు ఎప్పుడూ హాజరు కాలేదు. దీంతో అత‌ను కాదు అని తేలింది, అయితే ఆయ‌న ఎవ‌రో తెలిసింది, రాహుల్ఓ సీనియర్ జర్నలిస్టు.

చాలా కాలంగా ఆయన హిందూ దినపత్రికలో పని చేస్తున్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులతో ప‌నిచేశారు, ఆయ‌నకు ఎంతో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి, అందుకే ఆయ‌న‌తోనే సీఎం కేసీఆర్ ఇలా మాట్లా‌డుతున్నారు అని తేలింది, స‌మాజం ప‌ట్ల ప్ర‌జ‌ల ప‌ట్ల మంచి ఆర్టిక‌ట్స్ ఆయ‌న రాస్తార‌ట‌, అది విష‌యం.