కేసీఆర్ ప్రెస్ మీట్ లలో నాటు సరసం..రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Natu Sarasam in KCR press meet..Rewanth Reddy Ghat comments

0
89

కాంగ్రెస్ పని ఖతం ఐనది అంటున్న కేసీఆర్..హుజురాబాద్ లో బీజేపీతో కలిసి కాంగ్రెస్ ఓడగొట్టింది అని సీఎం అనలేదా అని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసే దమ్ము ఉందా. మోడీ కనుసన్నల్లోనే కేసీఆర్ నడుస్తున్నారు. కేంద్రం వడ్ల కొనుగోలు చేయను అంటే నేను కూడా కొననని కేసీఆర్ అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం బ్రోకర్ కాదు కదా. ఆల్టర్నేటివ్ పంటలు వేయాలన్నప్పుడు కనీస మద్దతు ధర ఎందుకు ప్రకటించడం లేదు.

కేసీఆర్ కు ఒక వ్యవసాయ విధానం అంటూ లేదు. కేసీఆర్ సీడ్ కంపెనీలకు అమ్ముడు పోయిండు. సీఎంకు అధికారం ఇచ్చింది ధర్నాలు చేయడానికా..వడ్లు కొనాల్సింది పోయి ధర్నాలు చేస్తావా.ఇన్ని రోజులు మోడీ సంకలో కేసీఆర్ ఉన్నది నిజం కాదా. కేసీఆర్ అవినీతిపై అన్ని ఆధారాలు ఢిల్లీలో ఇచ్చినం..మోడీపై ఉన్న నమ్మకంతో కేసీఆర్ దైర్యంగా ఉన్నడు.

సంజయ్ కి సవాల్ విసిరిండు మరి మోడీకి సవాల్ విసిరే దమ్ము కేసీఆర్ కు ఎందుకు లేదు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్, సంతోష్ ల ఎన్నికల అఫిడవిట్లు చూస్తే ఎంత సంపాదించారో తెలుస్తది.మందు పోసినోడికే మంత్రి పదవి ఇచ్చిండు. కేసీఆర్ బీజేపీని విమర్శించలేదు బండి సంజయ్ ని తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టాడు. మోడీ, షాతో ఉన్న బంధం వల్లే బండి సంజయ్ ఏం చేయలేడని కేసీఆర్ అంటున్నడు. కాంగ్రెస్ తో ఉన్న భయంతోనే మోడీ డైరెక్షన్లో బీజేపీని తిడుతున్నాడు. కేసీఆర్ ప్రెస్ మీట్లు నాటు సరసంలా ఉన్నాయి. సన్నాలు పండించమన్న సన్నాసి పండించిన తర్వాత వడ్లను కొనలేదు అంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.