సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం

సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం

0
100

ఇచ్చిన మాట తప్పడు మా కేసీఆర్ అంటారు గులాబీ పార్టీ నేతలు.. అవును కేసీఆర్ అన్నారు అంటే చేస్తారు… అవ్వదు అంటే చేయరు.. తాజాగా ఆర్టీసీ విషయంలో కూడా అదే చెప్పారు. మీ డిమాండ్లు తీరుస్తాం ప్రభుత్వంలో విలీనం చేయం అన్నారు. చివరకు కేసీఆర్ అదే చేశారు. దీంతో ప్రజల్లో కేసీఆర్ బలం ఏమిటో మరోసారి రుజవు అయింది.

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజుల పాటు సమ్మె చేశారు, చివరకు ఉద్యోగులు శాంతించి సీఎం కేసీఆర్ తో చర్చించి కొన్ని డిమాండ్లు నెరవేర్చుకున్నారు. సమ్మె సమయంలో ఉద్యోగులు తీవ్ర భావోద్వేగాలకి గురయ్యారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాలని ఆదుకోవాలి అని యూనియన్లు కూడా కోరాయి.

తాజాగా 100 కోట్లు ఆర్టీసీకి ఇస్తాం అన్నారు కేసీఆర్ ..అలాగే ఉద్యోగులకు జీతాలు ఇస్తామని చెల్లించారు..ఇప్పుడు కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమ్మె సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సంబంధించిన 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఆ కుటుంబాలు ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు

ఒకరికి కండక్టర్గా అవకాశం కల్పించగా, నలుగురికి జూనియర్ అసిస్టెంట్, ఐదుగురికి పోలీసు కానిస్టేబుళ్లుగా అవకాశం ఇచ్చారు. వీరందరికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కొలువులు ఇచ్చారు,వీరందరూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.