‘కేసీఆర్ ఉద్యోగం ఊడాలి- నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి’

0
82

నేడు గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి  మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటన అనేది పీకే వ్యూహంలో భాగం. ఈ నోటిఫికేషన్లను కాలయాపన చేస్తూ నిరుద్యోగులను నిండా ముంచాలని చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా ముందస్తు ఎన్నికల్లో భాగమే. ఈ డిసెంబర్ వరకే ఉద్యోగాల భర్తీ చేయాలి. ఆ తరువాతే ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక నిరుద్యోగులు ఉద్యోగాలు అడగడం కాదు. కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని రేవంత్ పేర్కొన్నారు.