కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం.. ఎంపీ కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం.. ఎంపీ కీలక వ్యాఖ్యలు

0
77

తెలంగాణలో కేసీఆర్ తర్వాత పార్టీని ముందుకు నడిపించేది ఆయన తనయుడు, మంత్రి అలాగే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని కారు పార్టీ నేతలు అంటూ ఉంటారు.. అయితే గత ఏడాది పార్టీ బాధ్యతలు కేసీఆర్ కేటీఆర్ కి అప్పగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు, అయితే ముఖ్యమంత్రి స్ధానం కూడా ఆయనకే ఇస్తారు అని వార్తలు వినిపించాయి.. కాని కేసీఆర్ మొత్తం టర్మ్ అంతా ఉంటారు అని అంటున్నారు.

తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి పీఠం పై ప్రశ్నలు వేస్తే మా బాస్ కేసీఆర్ అని ఆయన అసెంబ్లీలో గతంలో దీనిపై చెప్పారని అదే ఫైనల్ అని చెప్పారు, అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని మానుకోట ఎంపీ మాలోతు కవిత అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని ముందుకు తీసుకెళ్తూనే ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

రాజ్యసభ సభ్యుడు సంతోష్ గ్రీన్ చాలెంజ్ను స్వీకరించిన ఎంపీ మహబూబాబాద్లో బుధవారం మూడు మొక్కలు నాటారు. తన పార్లమెంట్ పరిధిలోని నర్సంపేట, డోర్నకల్, పినపాక ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, రెడ్యానాయక్, రేగ కాంతారావులకు ఆమె గ్రీన్ చాలెంజ్ విసిరారు. మొత్తానికి ఈ మధ్య టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి పదవిపై వ్యాఖ్యలు చేయడం పార్టీలోనే కాదు తెలంగాణలో ఆసక్తి రేపింది.