బ్రేకింగ్ — ఏపీలో ఆల‌యానికి సీఎం కేసీఆర్ విరాళం ఎక్క‌డంటే

బ్రేకింగ్ -- ఏపీలో ఆల‌యానికి సీఎం కేసీఆర్ విరాళం ఎక్క‌డంటే

0
111

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పూజ‌లు హోమాలు దేవాల‌యాల విష‌యంలో ఎంతో వాటిని న‌మ్ముతూ ఉంటారు, భ‌క్తి విశ్వాసాల పై ఆయ‌న‌కు ఎంతో న‌మ్మ‌కం ఉంటుంది, అంతేకాదు అనేక ఆల‌యాలు కూడా సంద‌ర్శిస్తూ ఉంటారు, తాజాగా ఏపీలో‌ ఓ ఆల‌యానికి సీఎం కేసీఆర్ విరాళం అందించార‌ట‌.

ఈ వార్త ఇప్పుడు ఏపీ తెలంగాణ ప్రాంతాల్లో వైర‌ల్ అవుతోంది. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో సాయం కోసం నిర్వాహకులు కేసీఆర్‌ను సంప్రదించారు అని తెలుస్తోంది.

దీంతో ఆయ‌న చేయూతనిచ్చారు. ఆలయానికి సంబంధించిన మహారాజ గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణానికి కేసీఆర్ దంపతులు విరాళమిచ్చారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఆయన పేరిట శిలాఫలకం ఆవిష్కరించారు. అయితే ఈ నిర్మాణం పూర్తి అయింది, నిన్న వైభ‌వంగా శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అయితే ఈ క‌రోనా లేక‌పోయి ఉంటే ఈ వేడుక‌లో సీఎం కేసీఆర్ పాల్గొనేవారు. కాని క‌రోనా దృష్ట్యా ఆయ‌న రాలేదు అని తెలుస్తోంది.