ఫ్లాష్- కేజ్రీవాల్​పై ఆ రాష్ట్ర సీఎం పరువు నష్టం దావా!

0
95

ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​పై పరువు నష్టం కేసు వేస్తానని పంజాబ్​ ముఖ్యమంత్రి చరణ్​జిత్​ సింగ్​ చన్నీ ప్రకటించారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు పరువునష్టం కేసు వేస్తానని ప్రకటించారు. ఇందుకోసం పార్టీ అనుమతి కోరినట్లు వెల్లడించారు. ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం కేజ్రీవాల్​కు అలవాటేనని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగానే గతంలో ఆయన భాజపా నేతలు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీతో పాటు ఎస్‌ఏడీ నేత బిక్రమ్‌సింగ్ మజీథియాకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందన్నారు.