కేర‌ళ‌లో భారీ విమాన ప్ర‌మాదం? 19 మంది మృతి అస‌లు ఏమైంది

కేర‌ళ‌లో భారీ విమాన ప్ర‌మాదం? 19 మంది మృతి అస‌లు ఏమైంది

0
111

కేరళలో పెను విమాన ప్ర‌మాదం జ‌రిగింది, ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వే నుంచి పక్కకు జరిగి 35 అడుగుల లోయలో పడి రెండు ముక్కలైంది. నిన్న రాత్రి 7.30 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

ఈ ప్ర‌మాదంలో పైలెట్ తో స‌హా 19 మంది మ‌ర‌ణించారు, ప్ర‌యాణం అంతా బాగా జ‌రిగింది సేఫ్ ల్యాండ్ అయింది కాని ర‌న్ వే పై వెళుతున్న స‌మ‌యంలో విమానం ముందుకు వ‌చ్చి లోయలో ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 100 మందికి పైగా గాయపడ్డారు.. కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఈ దారుణ ఘ‌ట‌న జ‌రిగింది.

వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి కోజికోడ్ వచ్చింది ఈ విమానం…ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వే నుంచి పక్కకు జరిగి 35 అడుగుల లోయలో పడి రెండు ముక్కలైంది. ఈ ఘ‌ట‌న‌తో దేశం ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది, ప్ర‌ధాని మోదీ నేరుగా కేర‌ళ సీఎంకు ఫోన్ చేసి ప‌రిస్దితి గురించి తెలుసుకున్నారు. అయితే భారీ వ‌ర్షాల వ‌ల్ల ర‌న్ వే పై నీరు ఉండి ఇలా జ‌రిగిందా, లేదా బ్రేక్ ఫెయిల్యూర్ వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగిందా అనేదానిపై విచార‌ణ చేస్తున్నారు.