శబరిమలలో భక్తులకు కీలక ప్రకటన చేసిన కేరళ సర్కార్

శబరిమలలో భక్తులకు కీలక ప్రకటన చేసిన కేరళ సర్కార్

0
85

బరిమల అయ్యప్ప ఆలయ దర్శనానికి సంబంధించి కోర్టు తీర్పు ఇంకా రావాల్సి ఉంది.. మరో ధర్మాసనానికి ఈకేసుని కేటాయించడం జరిగింది, అయితే నిన్నటి నుంచి అయ్యప్ప భక్తులకు స్వామి దర్శన భాగ్యం కలుగుతోంది. ఇక మహిళా భక్తులు కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటాము అంటున్నారు. ఈ సమయంలో పది మంది మహిళలు దర్శనం కోసం ప్రయత్నించారు. వారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళా భక్తులు అని తెలుస్తోంది, వారు విహారయాత్ర కోసం కేరళ వచ్చి అక్కడ గుడి తెరుచుకుంది అని దర్శనం కోసం వచ్చారట. కాని వారిని పోలీసులు అక్కడ నుంచి పంపించేశారు అని తెలుస్తోంది. తాము రక్షణ కల్పించలేము అని చెప్పడంతో వారు కూడా వెనుదిరిగారట.

దాదాపు వేల మంది పోలీసులకు అయ్యప్ప భక్తుల కోసం అక్కడకు విధుల కోసం వస్తారు.. ఈ సమయంలో వేలాది మంది పోలీసులు అన్ని విధాలుగా భక్తులకు సాయం చేస్తారు… కాని ఈ సమయంలో మహిళా భక్తులు దర్శనం చేసుకుంటాము అని చెబితే, వారికి మాత్రమే బందోబస్తు ఇస్తే , ఇక అయ్యప్పమాల వేసుకున్న వారికి సేవ చేయలేము అంటున్నారు అక్కడ పోలీసులు, ఇఫ్పటికే లక్షల సంఖ్యలో అక్కడకు భక్తులు వస్తారు.. ఈ సమయంలో దయచేసి మహిళా భక్తులు రావద్దు అని చెబుతున్నారు పోలీసులు. దీంతో చాలా మంది మహిళలు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు.