కువైట్ లోని భారత ఎంబీసీ కీలక ప్రకటన చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో సోమవారం ఎంబసీ మూసి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సర్వీసులకు ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు.
అలాగే షరాఖ్, ఫహహీల్, జలేబ్ అల్ షువైఖిలోని సీకేజీఎస్ కేంద్రాల్లో పాస్ పోర్ట్ సేవలు కూడా యధావిధిగా ఉంటాయని తెలియజేశారు. ఇక కువైట్ లోని బీఎల్ఎస్ ఇంటర్నెషనల్ కాన్సులర్ , పాస్పోర్టు, వీసా సర్వీసుల కోసం ఇండియన్ ఎంబసీతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 2022 జనవరి నుంచి బీఎల్ఎస్ ఇంటర్నెషనల్ ఈ సర్వీసులను ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించింది. ఈ సర్వీసులను ఎంబీసీ మంగళవారం నుంచి ప్రారంభిస్తుంది.
కాగా ఇప్పటివరకు కువైట్ లో ఇండియన్ పాస్పోర్టు, వీసా సేవలను సీకేజీఎస్ అందించింది. ఇప్పుడు సీకేజీఎస్ చేతి నుంచి ఈ బాధ్యతలను బీఎల్ఎస్ ఇంటర్నెషనల్ కు అందించింది భారత ఎంబసీ. దీంతో షరాఖ్, ఫహహీల్, జలేబ్ అల్ షువైఖ్లో మూడు కేంద్రాలను తెరిచి కాన్సులర్, పాస్పోర్టు, వీసా సర్వీసులను అందించేందుకు బీఎల్ఎస్ రెడీ అవుతోంది . వీటితో పాటు దరఖాస్తుదారులకు కొన్ని ఇతర సేవలు ( ఫార్మ్ ఫిలింగ్, ప్రిటింగ్, ఫొటోగ్రఫీ) కూడా అందించనుంది. దీనిలో భాగంగా కంపెనీ ప్రతి యేటా సుమారు 2 లక్షల దరఖాస్తులను ప్రాసెస్ చేస్తుందని భావిస్తున్నారు.