పాన్ ఇండియా సినిమాలో హీరోగా కాంగ్రెస్ కీలక నేత..హీరోయిన్ ఎవరంటే?

Key Congress leader as a hero in Pan India movie..Do you know who the heroine is?

0
75

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత హీరోగా మారనున్నారు. ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతున్నట్టు సమాచారం. ఫిబ్రవరిలో ఆయన నటించిన సినిమా విడుదల కానుంది. ఇంతకు ఆ నాయకుడు ఎవరూ? ఆయన నటిస్తున్న సినిమా ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ  అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పార్టీ వాయిస్ ను జనాల్లోకి తీసుకెళ్తూ ఉంటారు.  అయితే ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు సినీ హీరోగా మారనున్నారు. బొమ్మక్ మురళి అద్దంకి దయాకర్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగానే కనిపిస్తుండడం విశేషం. ఆయన పాత్ర పేరు కూడా అద్దంకి దయాకర్ కావడం మరో విశేషం.

ఈ సినిమాలో అద్దంకితో పాటు ప్రజా యుద్ధనౌక గద్దర్ కూడా కలిసి నటిస్తున్నారు. అద్దంకి భార్యగా ప్రముఖ సినీ నటి ఇంద్రజ నటిస్తున్నారు. మరో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాకు మేరా భారత్, జై భారత్ అనే పేర్లను పరిశీలిస్తున్నారని అద్దంకి తెలిపారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రస్తుతం నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.