ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. పదివేల కేసులు నమోదు అయ్యే స్దితి నుంచి రోజుకి రెండు వేల కేసులు నమోదు అయ్యే స్దితికి చేరింది, భారీగా పాజిటీవ్ కేసులు తగ్గుతున్నాయి. రికవరీ రేటు పెరుగుతోంది అందుకే.
మార్చి నెల చివరి నుంచి ఇప్పటివరకు స్కూల్స్ ఓపెన్ చేయలేదు. ఇక ఏపీ ప్రభుత్వం పలుమార్లు స్కూల్స్ ఓపెన్ చేయాలని భావించి వెనకడుగు వేసింది, అయితే ఇటీవల ప్రకటన చేశారు. నవంబర్ 2 నుండి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లను పున: ప్రారంభించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
మరి విద్యార్దులకి స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు అవుతున్న విషయం తెలిసిందే, ఈ కరోనా నిబంధనలు ఉన్న వేళ అక్కడ వంట వండే వారికి కొన్నినిబంధనలు తెలిపింది ప్రభుత్వం. వంట చేసే సమయంలో వాచ్ రింగులు గాజులు బంగారం ధరించకూడదని తెలిపారు, అంతేకాదు గోళ్ల రంగులు వేసుకోకూడదు.
ఇక వంట వండే సమయంలో కూరగాయలు కచ్చితంగా పసుపు వేసి ఉప్పు వేసి శుభ్రం చేయాలి, పరిసరాలు బాగుండాలి, అలాగే పిల్లలు భౌతిక దూరం పాటించేలా చూసుకోవాలి, ఇక సిబ్బంది టీచర్లు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలి అని తెలిపారు.