Flash- ఇంటర్ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు

Key judgment of the High Court on Inter examinations

0
87
Telangana

తెలంగాణ: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో లంచ్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టులో తల్లిదండ్రుల సంఘం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దని పిటిషనర్ కోరారు. పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలని కోరారు. తల్లిదండ్రుల సంఘం తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ వాదనలు వినిపించారు.

అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ  చేపట్టింది. తల్లిదండ్రుల సంఘం తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.

పరీక్షలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందని, పిటిషన్ దాఖలు చేయడంలో చాలా ఆలస్యమైనందని కోర్టు అభిప్రాయపడింది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పిటిషన్ వెనక్కి తీసుకోవాలని పిటిషనర్లకు సూచించింది. కాగా తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు అక్టోబ‌ర్ 25 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.