తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. ఈ మహమ్మారి దెబ్బకు ఏపీ సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూతో పాటు పలు ఆంక్షలు విధించారు. తాజాగా తెలంగాణలో రాత్రి కర్ఫ్యూపై డీహెచ్ డాక్టర్ డి శ్రీనివాస్ రావు క్లారిటీ ఇచ్చారు. రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కోవిడ్ వ్యాప్తి లేదని..పాజిటివిటి రేటు 10 శాతం దాటితే మాత్రమే కర్ఫ్యూ అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటి రేటు 3.16 శాతం ఉందని ఆయన వివరించారు. దీనితో తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ఉండదనే క్లారిటీ వచ్చేసింది.