KFC యాడ్ లో ఇక అది కనిపించదు- కరోనా వేళ కీలక నిర్ణయం

KFC యాడ్ లో ఇక అది కనిపించదు- కరోనా వేళ కీలక నిర్ణయం

0
90

ఈ వైరస్ దాటికి అనేక వ్యాపారాలు దారుణంగా నష్టపోయాయి, ముఖ్యంగా ఫుడ్ పరిశ్రమ చాలా దారుణంగా దెబ్బతింది, అయితే వరల్డ్ ఫేమస్ అంటే KFC ఫుడ్ అనే చెప్పాలి, ఎక్కడ కనిపించినా ఇది తినాలి అని నోరు ఊరుతుంది, అయితే ఈ కరోనా ప్రభావంతో కీలక నిర్ణయం తీసుకుంది
KFC.

అమెరికాకు చెందిన రెస్టారెంట్ దిగ్గజ సంస్థ కెంటకీ ఫ్రైడ్ చికెన్పై కేఎఫ్సీ పై పలు ఫిర్యాదులు వచ్చాయి.కేఎఫ్సీ తన ప్రచార చిత్రాల్లో ట్యాగ్ లైన్గా ఫింగర్ లికింగ్ గుడ్అని ప్రతి చోటా ఊపయోగిస్తుంటుంది.
అయితే ఇప్పుడు దీనిని తొలిగించాల్సి వస్తోంది, కారణం కరోనా..

కేఎఫ్సీలో చికెన్ తింటుంటే వేళ్లు కూడా నాకేంత రుచిగా ఉంటుందన్న అర్థం వచ్చేలా ఫింగర్ లికింగ్ గుడ్ అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. వ్యక్తిగత శుభ్రతకు, సామాజిక దూరానికి మరింత ప్రాధాన్యతనిచ్చేలా కంపెనీ ఈ ట్యాగ్ లైన్ మార్చనుంది,బోర్డులు కవర్లు ప్యాక్ కవర్లు, యాడ్స్ ఇలా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అన్నీ మారతాయి ట్యాగ్ లైన్స్ .. కేఎఫ్సీ సంస్థను 1930లో హార్లండ్ శాండర్స్ అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో స్థాపించారు. ఇక కరోనా తగ్గిన తర్వాత మళ్లీ అదే ట్యాగ్ లైన్ కొనసాగిస్తామని చెబుతున్నారు కంపెనీ ప్రతినిధులు.