వినాయక చవితి వచ్చింది అంటే చాలు మన దేశంలో గణనాధుడి విగ్రహాలు పెద్ద ఎత్తున వీధుల్లో నిలబెడతారు, ఆ గణపయ్యకి పూజలు జరుపుతారు, అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి.
అయితే ఎప్పుడూ పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు ఖైరతాబాద్ లో, కాని ఈసారి వైరస్ ఎఫెక్ట్ తో ఈ ఏడాది 27 అడుగులకే పరిమితం చేశారు విగ్రహాన్ని. గత ఏడాదితో పోల్చితే 38 అడుగులు విగ్రహ ఆకారం తగ్గిస్తున్నారు. గత ఏడాది 65 ద్వాదశాదిత్య మహా గణపతి గా పూజలు అందుకున్న గణేశుడు… ఈ సారి పూర్తి మట్టి వినాయకుడు గా 27 అడుగుల ఎత్తులో భక్తులకు కనిపించనున్నాడు.
తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది ఖైరతాబాద్ లోని మహగణపతి ఉత్సవ కమిటీ, ఇక దర్శనం కూడా పూర్తిగా భౌతిక దూరం పాటిస్తూ భక్తులకి కల్పిస్తారు, ఆన్ లైన్ లో కూడా దర్శనానికి ఏర్పాట్లు చేయనున్నారు.