ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవక‌మిటి విగ్ర‌హం పై కీల‌క నిర్ణ‌యం

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవక‌మిటి విగ్ర‌హం పై కీల‌క నిర్ణ‌యం

0
85

మనదేశం పైనే కాదు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఈ వైర‌స్ వ‌ణికిస్తోంది, దీంతో అంద‌రూ ఇంటి ప‌ట్టున ఉండే ప‌రిస్దితి వ‌చ్చింది, ఉద్యోగాలు వ్యాపారాలు ఏమి చెయ్య‌డానికి లేని స్దితి.. అయితే ఈ వైర‌స్ ఎఫెక్ట్ దేవాల‌యాల‌పై కూడా ప‌డింది.. లాక్ డౌన్ తో భ‌క్తులు కూడా ఎవ‌రూ దేవాల‌యాల‌కి రాని ప‌రిస్దితి ఏర్ప‌డింది.

అయితే వినాయ‌క చ‌వితి వ‌చ్చింది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఖైర‌తాబాద్ గ‌ణ‌నాధుని విగ్ర‌హం గురించి చ‌ర్చ జ‌రుగుతుంది, భారీ గ‌ణ‌నాథుడ్ని ప్ర‌తిష్టిస్తారు, అయితే ఈ ఏడాది లాక్ డౌన్ ఎఫెక్ట్ వైర‌స్ వ‌ల్ల కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సైతం కరోనా ప్రభావంతో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ సంవత్సరం వినాయకచవితి సందర్భంగా కేవలం ఒక్క అడుగు ఎత్తున్న విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించాలని నిర్ణయించింది. ఈ వైర‌స్ వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్నారు,
అంతేకాదు, భారీ విగ్రహ నిర్మాణం కోసం నిర్వహించే కర్ర పూజను సైతం రద్దు చేశారు. వాస్తవానికి ఈ నెల 18న కర్ర పూజ చేసి శాస్త్రోక్తంగా విగ్రహ తయారీ చేయాలి, కాని షెడ్యూల్ మార్చేశారు.