చైనాలో పిల్లలు కరోనా దెబ్బకి ఏం చేశారో తెలిసి ప్రపంచమే షాక్

చైనాలో పిల్లలు కరోనా దెబ్బకి ఏం చేశారో తెలిసి ప్రపంచమే షాక్

0
127

వుహాన్ నగరం పేరు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తూ ఉంది, అయితే కరోనా వైరస్ వల్ల ఈ నగరం పేరు బాగా వినిపించింది. ఇక్కడ చాలా వరకూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.. చైనాలో చాలా మందిని కరోనా పొట్టన పెట్టుకుంది ఇక్కడే… దీంతో చాలా మంది నెల రోజులుగా ఆఫీసుకి వెళ్లలేదు, అలాగే పిల్లలు స్కూల్స్ కి వెళ్లలేదు.

కాని ఇక్కడ టీచర్లు మాత్రం పిల్లలకు విద్యా సంవత్సరం వృథా కాకుండా టెక్నాలజీ సాయం తీసుకున్నారు. డింగ్టాక్ అనే యాప్ ద్వారా ఇళ్లకే పరిమితమవుతున్న పిల్లలకు హోం వర్కులు, అసైన్మెంట్లు ఇచ్చారు. కాని పిల్లలకు ఈ సెలవులు బాగా నచ్చాయి, అందుకే ఈ వర్కులకి పెద్ద సమయం కేటాయించలేదు.

హోం వర్క్ తప్పించుకోవాలి అని రీజన్ తో ఆ యాప్ కు తక్కువ రేటింగ్ ఇచ్చారు, ఇలా తక్కువ రేటింగ్ వచ్చే యాప్స్ ని తొలగించాల్సి ఉంటుంది అలా ఆ యాప్ స్టోర్ నుంచి కనిపించకుండా పోయింది,
అయితే చైనా బుడతలు మాత్రం కరోనా సెలవుల్ని పూర్తిగా వాడేసుకుందామని ఫిక్సైయ్యారు. హోం వర్క్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో వారు సదరు యాప్కు తక్కువ రేటింగులు ఇవ్వడం మొదలు పెట్టారు. కేవలం రోజుల వ్యవధిలో యాప్ రేటింగ్ 4.9 నుంచి 1.4కు పడిపోయింది. జాక్ మా సారథ్యంలోని ఆలీబాబా గ్రూప్ ఈ యాప్ను నిర్వహిస్తోంది, అయితే అంతా సర్దుకున్నాక ఈ యాప్ మళ్లీ వస్తుంది అంటున్నారు కంపెనీ వారు.